పుట్టిన రోజు నాడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన బీజేపీ ఎంపీ

0 18

బెంగళూరు ముచ్చట్లు :

 

చామరాజనగర బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్‌ తన 75వ పుట్టిన రోజున రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. శుక్రవారం మైసూరులోని జయలక్ష్మపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 14 సార్లు ఎన్నికల్లో పోటీచేశానని, 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించానని అన్నారు. నాలుగేళ్ల క్రితమే రిటైర్‌ అవ్వాలనే నిర్ణయం తీసుకున్నానని, కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మరికొంత కాలం కొనసాగానని అన్నారు. ఎంపీగా ప్రస్తుత పదవీకాలాన్ని పూర్తి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీకి దిగనని స్పష్టం చేశారు.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; BJP MP says goodbye to politics on his birthday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page