పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్మే వనమా

0 3

భద్రాద్రి కొత్తగూడెం  ముచ్చట్లు:
పాత కొత్తగూడెం లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇళ్ళు కోల్పోయిన రైల్వే నివాసిత నిర్వాసితుల పునరావాస కేంద్రాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్య పడవద్దని తెలిపారు. పాత కొత్తగూడెంలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే కోటాలో కేటాయిస్తున్నట్లు హామి ఇచ్చారు.రెండు నెలల్లో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Emmelme Vanama visiting the rehabilitation center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page