ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం:సిఎస్

0 7

హైదరాబాద్  ముచ్చట్లు:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం, అదనపు అంతస్తుల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు.  రాష్ట్రంలోని అన్ని బోధన మరియు జిల్లా ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్ మరియు ఐసియు పడకలను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.  జిహెచ్ ఎంసి  పరిధిలోని ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించుటకు ప్రత్యేక “మాప్ అప్ డ్రైవ్” నిర్వహించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.ఏ.ఎం రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్  డా. రమేష్ రెడ్డి, టిఎస్ ఎమ్ ఐడిసి ఎం.డి   చంద్ర శేఖర్ రెడ్డి,  టిఎస్ఐఐసి  సి.ఇ  శ్యామ్ సుందర్,  టిఎస్ ఎం ఐడిసి సి.ఇ  రాజేంద్ర  ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

సింధూకు జగన్ సత్కారం

Tags:Accelerate the process of filling vacant posts in government hospitals: CS

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page