ప్లాస్టిక్ బియ్యం కాదు మంచి బియ్యమే-గెజిటెడ్ అధికారి రామచంద్రయ్య

0 14

కౌతాళం ముచ్చట్లు:

 

కౌతాళం లో జనసేన నాయకులు రామాంజనేయులు ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్న రానే  ఆరోపణల సందర్భంగా ప్లాస్టిక్ బియ్యం పై వచ్చిన కథనానికి స్పందించి జిల్లా గెజిటెడ్ అధికారులు,ఫుడ్ ఇన్స్పెక్టర్  రామచంద్రయ్య వారి సిబ్బంది శనివారం కౌతాళం  ఉన్నత పాఠశాలలో బియ్యాన్ని తనిఖీలు చేశారు. కానీ ఎలాంటి ప్లాస్టిక్ బియ్యం లేవని అపోహలు మాత్రమే అని తెలిపారు. పిల్లల కు,గర్భిణీ స్త్రీలకు మంచి నాణ్యత బియ్యం అందించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మీరు చూపించన ప్లాస్టిక్ బియ్యము ను కూడ ల్యాబ్ తనిఖీ చేసి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ పాల్ దినకర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ బియ్యం అనే అపోహలు పెట్టుకోవద్దని జగన్ ప్రభుత్వం లో  మంచి నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే ప్రతి పేద వారు జగన్నాన్న గోరుముద్ద ప్రతి ఒక్కరు లబ్దిపొందలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వారి సిబ్బంది ఉన్నత పాఠశాల చైర్మన్ వడ్డే రాముడు,సర్పంచ్ పాల్ దినకర్, జనసేననాయకులు రామాంజనేయులు ,వహిద్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; Plastic rice is not good rice-Gazetted Officer Ramachandraya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page