బియ్యపు మధుసూదనరెడ్డికి  కష్టాలు

0 37

తిరుపతి ముచ్చట్లు:

 

అధికారంలో ఉన్న వారికే అన్నీ కష్టాలు. అందరినీ కలుపుకుని పోతేనే మళ్లీ గెలుపు తలుపు తడుతుంది. లేకుంటే ఇబ్బందులు తప్పవు. వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు ఇదేరకమైన ఇబ్బందులు పడుతున్నారు. నామినేటెడ్ పోస్టులతో వైసీపీలో ఊపు వస్తుందని భావిస్తే కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం తీవ్ర అసంతృప్తిని కలిగించిందనే చెప్పాలి. హైకమాండ్ కు నమ్మకంగా ఉన్న ఎమ్మెల్యేలకు సయితం ఈసారి మొండిచేయి చూపారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచారు. బొజ్జల కంచుకోటను బద్దలు కొట్టగలిగారు. ఒకరకంగా చెప్పాలంటే బొజ్జల ఫ్యామిలీ మీద గెలిచి రికార్డు సృష్టించారు. తనను ఎమ్మెల్యేగా చేసిన జగన్ పట్ల బియ్యపు మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతగానే ఉంటారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే హైలెట్ చేస్తూ వస్తున్నారు.ఇటీవల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. అందులో శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ పోస్టు ఒకటి. దీనికి బీరేంద్ర వర్మను ఛైర్మన్ గా నియమించారు. బీరేంద్ర వర్మ సత్యవేడు మండలానికి చెందిన వ్యక్తి. సంప్రదాయం ప్రకారం దశాబ్దాలుగా శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ గా స్థానికులనే నియమిస్తున్నారు. కానీ ఈసారి స్థానికేతరుడిని నియమించడం బియ్యపు మధుసూదన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఈ పోస్టును తన గెలుపునకు పనిచేసిన వారికి ఇప్పించాలని ఆయన అనుకున్నారు. ఈ మేరకు హామీ కూడా ఇచ్చారు.కానీ జిల్లా మంత్రి జోక్యంతో ఈ పోస్టును ఇతరులకు కేటాయించడంతో బియ్యపు మధుసూధన్ రెడ్డి అసంతృప్తికి గురయినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లా మంత్రితో కొంత గ్యాప్ ఉంది. ఈ నియామకంతో మరింత గ్యాప్ పెరిగిందంటున్నారు. మంత్రి తమ నియోజకవర్గాల్లో పెత్తనం చేయడమేంటని బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అనుచరుల ముందు తాను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బియ్యపు మధుసూధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

 

Tags: Difficulties for Madhusudan Reddy of rice

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page