బోయకొండను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం- వై ఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 24

– దేవాదాయశాఖ రాష్ట్ర స్థపతితో కలిసి పరిశీలన
– సులభతరంగా అమ్మవారిని దర్శించుకొనే చర్యలు
-మాస్ట్ప్లాన్‌ ద్వారా అభివృద్ది పనులకు స్వీకారం

 

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ ను ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా , రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పి.వి మిథున్‌రెడ్డిల లక్ష్యమని వై ఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. శనివారం ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబరు మత్యంశెట్టి విశ్వనాథం, దేవదాయశాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప తో కలిసి బోయకొండ అమ్మవారిని దర్శించుకొన్నారు. వీరిని ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం బోయకొండలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను స్థపతి తో కలిసి పరిశీలించారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేర కు బోయకొండలో మాస్టర్‌ ప్లాన్‌ మేరకు భక్తులకు అవసరమైన సదుపాయాలతో రూపొందించే పనులపై చర్చించారు.సులభతరంగా అమ్మవారిని భక్తులు దర్శించుకొనేలా ఏర్పాట్లు చేస్త్రున్నామన్నారు. పర్యాటక క్ష్యేత్రంగా ఆదర్శంగా గుర్తింపు తేవడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంను తలపించేలా ఆలయం వద్ద ఉపాధి హామీ నిధులతో పార్క్ ఏర్పాటుచేస్తున్నామని, ఆస్థలంలో పెంచదలచిన వెహోక్కలు తదితర అంశాలపై చర్చించారు. ఇంకనూ ఆలయం వద్ద చేపట్టాల్సిన పనులు, ఇతర లోటుపాట్లును గుర్తించి వాటిని సవరించడానికి ఆలయ పరిసరాలను పరిశీలించారు. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు, చేప్రట్టబోయే పనులపై చర్చించారు. బోయకొండలో అత్యంత సుందరంగా, భక్తులను ఆకర్షించేలా , ఆహ్లాదకరమైన వాతావరణంను రూపొందించేలా ప్రణాళికలు సిద్దం చేశామని పేర్కొన్నారు. జరుగుతున్న అభివృద్దిపనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లుకు సూచించారు. ఇంకనూ అవసరమైన పనులను మంజూరు చేయడానికి ప్రతిపాధనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓ చంద్రమౌళి, మంత్రి పిఏ చంద్రహాస్‌, పాలకమండళి సభ్యులు వెంకటరమణారెడ్డి, పూర్ణిమా మోహన్‌రాయల్‌, మాజీ ఎంపీపీ నరసింహులు,సోమల మల్లికార్జునరెడ్డి,ఎంపీడీఓ శంకరయ్య, ఏపిఓశ్రీనివాసుల యాదవ్‌,జేఈ పురుషోత్తం తదితరులున్నారు.

 సింధూకు జగన్ సత్కారం

Tags: The aim is to make Boyakonda a tourist destination, said YSSRCP Secretary of State Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page