భక్తుల ఆభరణాలపై కన్నేసిన పూజారి

0 13

అర్ధరాత్రి వేళల్లో దొంగతనానికి ప్రయత్నం
కర్నూలు  ముచ్చట్లు:
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామం లో రంగస్వామి దేవాలయం దర్శనమునకు వచ్చిన మహిళ భక్తుల ఆభరణాలను దొంగతనానికి ఆలయ పూజారి ప్రయత్నించాడు.
ఆస్పరి మండలం చెందిన భక్తులు స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి రాత్రి ఆలయంలోనే నిద్రించి ఉదయనే దైవ దర్శనం చేసుకొని తమ ఊర్లకి పోవాలని ఆలయంలో రాత్రి నిద్రించారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న మహిళ ఆభరణాలను అర్ధరాత్రి దొంగలించడానికి ఆలయ పూజారి  ప్రయత్నించాడు.  అప్రమత్తమైన మహిళలు. పూజారిని పట్టుకున్నారు. భక్తులు,  గ్రామస్తులు దేహశుద్ధి చేసారు. ఆలయ సిబ్బంది మాత్రం  పూజారి చేసిన ఈ నిర్వాహకని బయటకు పొక్కకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసారు. దేవాలయంలో సీసీ ఫుటేజ్ లో అర్ధరాత్రి పూజారి భక్తులు నిద్రిస్తున్న దగ్గర తిరుగుతున్న దృశ్యాలు. పూజారి పట్టుకోవడానికి పరిగెడుతున్న భక్తులు సీసీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. భక్తుల ఆభరణాలు దొంగతనానికి ప్రయత్నించిన పూజారిపై ఎండోమెంట్ అధికారులు  ఎలాంటి చర్యలు చేపట్టపోవడం గమనార్హం.

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:A priest looking for the jewels of the devotees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page