మహిళ దారుణ హత్య..

0 21

నారాయణపేట ముచ్చట్లు:

 

నారాయణపేటలో దారుణం చోటుచేసుకుంది. నారాయణపేట పట్టణం బీసీ కాలనీ కి చెందిన కర్రెమ్మ(50) అనే మహిళ గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సీసీ కెమెరా ద్వారా అనుమానంగా ఉన్నత నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా పలు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నారాయణపేట నుంచి తిప్రస్ పల్లి కి మద్యం కోసం వెళ్ళడానికి రెడీగా ఉన్న కరేమ్మను ఇద్దరు వ్యక్తులు బైక్ పై ఊట్కూరు మండలం తిప్రస్ పల్లి తీసుకెళ్లి ముగ్గురు కలసి మద్యం తాగి తిరిగి నారాయణ పేట సమీపంలో గడ్డం మీద అప్పం పల్లి గ్రామానికి చేరుకొని అక్కడ కూడ మద్యం సేవించి తిరిగి సింగారం దగ్గర లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల   సమీపంలోని ఒక పాడుబడిన ఇంట్లో మళ్ళీ మద్యం తాగి అక్కడే మహిళను  బండ రాయితో తలపై బాదాటంతో ఆమె చనిపోయింది. హత్య చేసి అనంతరం శవాన్ని సగం వరకు కాల్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సగం కాలిని శవాన్ని తీసుకెళ్లి కల్వర్టు కింద ఉంచినట్లు తెలిసింది. ఈ దారుణానికి  పాల్పడిన ఇద్దరు అదే కాలానికి చెందిన  నరేష్,నారాయణ అని తెలిసింది. నరేష్ గతంలో ఒక యువతిపై యాసిడ్ దాడి కేసులో నిందితుడు.విషయం తెలుసుకున్న బీసీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ చేరుకుని నిందితులని చంపేయాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.ఇంకా పోలీసుల సగం కాలిన  మృతదేహానికి పోస్టు మార్టం కు తరలించారు.ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది.

 

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; Woman brutally murdered ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page