మృతుని కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి-పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

0 8

జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల పట్టణానికి చెందిన చిట్ల చంద్రశేఖర్( 50 ) శనివారం ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులను స్థానిక ఏరియా ఆస్పత్రిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి  పరామర్శించి తన  ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ  మాట్లాడుతూ మృతుడు చంద్రశేఖర్ గతంలో మున్సిపల్ ఒప్పంద కార్మికులుగా పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మున్సిపల్ కమిషనర్ అకారణంగా చంద్రశేఖర్ ను విధుల నుంచి తప్పించారు, దీనితో మనస్తాపం చెందినటువంటి  చంద్రశేఖర్ ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు గడవడం కష్టంగా మారిన తరుణంలో  ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని అన్నారు. అలాగే అతని కుటుంబ సభ్యునికి ఒప్పంద కార్మికులుగా మళ్లీ మున్సిపల్ అధికారులు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు.ఈ పరామర్శలో ఎమ్మెల్సీ వెంట రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి బండ శంకర్, కాంగ్రెస్ నాయకులు చిట్ల అంజన్న, తాడేపు రమణ, మున్నూరు కాపు సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.

సింధూకు జగన్ సత్కారం

 

- Advertisement -

Tags:The family of the deceased should be given a job-graduate emcee t. Jeevan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page