రైతు వేషంలో హడలెత్తించిన సబ్ కలెక్టర్

0 17

కైకలూరు ముచ్చట్లు :

- Advertisement -

అది కైకలూరు జాతీయ రహదారిపై అడవి నాయుడు సెంటర్‌. సమయం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలు. లుంగీ, షర్టు ధరించి ఓ వ్యక్తి బైక్‌పై ఎరువుల దుకాణానికి వచ్చాడు. యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. దుకాణం యజమాని ఓ తెల్లచీటీపై రాసి, పక్కనే గోడౌన్‌లో తెచ్చుకో అని పంపించాడు. అక్కడకెళ్లి రెండు బస్తాలను బైక్‌పై వేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చాడు. బోర్డులో సూచించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారేంటని నిలదీశాడు. రైతులందరి నుంచి ఇలానే వసూలు చేస్తున్నారా అంటూ గద్దించాడు.. అప్పటికి గానీ ఆ వ్యాపారికి అర్థంకాలేదు.. ఎరువుల కోసం వచ్చింది రైతు కాదు, విజయవాడ సబ్‌ కలెక్టరు జి.సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌ అని. దుకాణదారుడు ఆశ్చర్యపోయాడు. దుకాణాన్ని సీజ్‌ చేసి, చర్యలు తీసుకోవాలని తహసీల్దారు సాయి కృష్ణకుమారిని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

 సింధూకు జగన్ సత్కారం

Tags; A sub-collector dressed as a farmer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page