రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

0 11

కడప ముచ్చట్లు:

 

కడప జిల్లాలో అర్ధరా త్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఇన్నోవా వాహనం ఢీ కొన్నాయి. మైదుకూరు- బద్వేలు రహదారిపై బ్రహ్మంగారిమఠం మండలం అగ్రహారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందా రు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జ అయింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతపురం నుంచి టమోటాలతో విజయవాడ వెళ్లేందుకు మైదుకూరు, బద్వేలు వైపునకు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురిని సద్దాం, రేష్మ, సల్మాలుగా గుర్తించారు. మరోకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; Four killed in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page