లీకుల వీరుల పని పట్టే పనిలో సర్కార్

0 14

విజయవాడ ముచ్చట్లు:

 

ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే అసలైన ప్రభువులు. ఎవరికీ శాశ్వతమైన అధికారాలను జనాలు ఇవ్వలేదు. అలా ఎవరైనా అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. ఇదిలా ఉంటే ప్రభుత్వం అంటే అధికారులు ఉంటారు. వారి సహకారం కూడా అవసరం అవుతుంది. అధికారులను ప్రభుత్వ పెద్దలు నమ్మాలి. అలా కాకుండా వారిని అనుమానించడం మొదలుపెడితే మాత్రం పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ సర్కార్ వైఖరి చూస్తే అధికారులతో లడాయి పెట్టుకోవడానికే రెడీ అవుతోంది అంటున్నారు.ఆర్ధికపర‌మైన విషయాలు లీక్ అవుతున్నాయని వైసీపీ సర్కార్ కుతకుతలాడిపోతోంది. అవును ప్రభుత్వం ఎక్కడ అప్పు చేస్తోంది, ఇప్పటిదాకా ఎక్కడ చేసింది అన్న వివరాలు తాటికాయంత అక్షరాలతో టీడీపీ అనుకూల మీడియాలో వస్తూంటే పాలకులకు ఎక్కడో కాలిపోతోందిట. దాని కంటే ముందు అది నామార్దా కదా. ఏకంగా ప్రభుత్వం పరువే పోతోంది. దాంతో ఈ లీకుల వీరులను సర్కార్ కనిపెట్టి పనిపట్టేసింది. అ విధంగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసేంది. దాంతో ఉద్యోగ వర్గాలలో పెద్ద ఎత్తున కలవరం రేగుతోంది.వెనకటికి ఎవరో మీకు బట్టతల ఉంది అన్నారట. దానికి ఆ పెద్ద మనిషి నేనంటే గిట్టని వారు ఆ మాట మీకు చెప్పారా అని మండిపడ్డారుట.

 

 

 

 

- Advertisement -

ఇపుడు ఏపీ ఆర్ధిక పరిస్థితి అన్నది బట్టతల మాదిరిగా అందరికీ కళ్ల ముందు కనిపిస్తోంది. ఫస్ట్ తారీఖునకు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందుకుని ఎన్ని నెలలు అయింది. అలాగే కాంట్రాక్టర్ల బిల్లుల పే మెంట్ లేదు, మరో వైపు చూస్తే అభివృద్ధి కోసం ఖర్చు చేయడానికి పైసా ఆదాయం లేదు. ఇవన్నీ ఖజానా ఖళీని వెక్కిరించడంలేదా. కానీ వైసీపీ పెద్దలు మాత్రం దీనికి బాధ్యత అంటూ కొందరు అధికారుల మీద వేటు వేసి భయపెట్టాలని చూస్తున్నారు అంటున్నాయి విపక్షాలు.ఇది సాంకేతిక యుగం. ఏ సీక్రేట్ ని కూడా ఎవరూ దాచలేరు. ఇక ప్రభుత్వంలో పాలన అంటే ఒక విధంగా పారదర్శకంగానే సాగుతుంది. భారత్ లాంటి దేశాలలో చాలా విషయాలు అలా బయటకు వచ్చేస్తాయి. మరి అలాంటి చోట లీకులు అవుతున్నాయని బాధపడి మండిపడడం అంటే అధికారులతో కోరి కయ్యం పెట్టుకోవడమే అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ సర్కార్ జాగ్రత్త పడాల్సి ఉందని కూడా అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుని ఎవరూ బాగుపడిన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికే వివిధ కారణాలతో సర్కారీ వేతన జీవులు గుర్రు మీద ఉన్నారు. ఇలాంటి యాక్షన్ సీన్లతో వారిని బాగా కెలికితే డ్యామేజ్ అవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

 

 సింధూకు జగన్ సత్కారం

 

Tags: Sarkar in the work of taking the work of the heroes of the leaks

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page