విస్మయ భర్తకు షాక్

0 23

తిరువనంతపురం  ముచ్చట్లు:

కేరళలో తీవ్ర సంచలనం రేకెత్తించిన విస్మయ(23) అనే యువతి అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త ఎస్‌. కిరణ్‌ కుమార్‌కు విజయన్ సర్కారు షాకిచ్చింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. విస్మయను బలిగొన్న కిరణ్‌కు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మహిళా, ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు.పోలీసులు సేకరించిన వివరాలు, కిరణ్‌ వాంగ్మూలం, మిగతా ఆధారాలన్నీ పరిశీలిస్తే అతడు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించాడని నిర్ధారణ అవుతోందని, అందుకే ఉద్యోగం నుంచి తొలగించామని కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోనీ రాజు వెల్లడించారు. దీంతో అభంశుభం తెలియని విస్మయని పొట్టన పెట్టుకున్న కిరణ్‌కుమార్‌కి తగిన శాస్తి జరిగిందని, న్యాయస్థానంలో అతడిని మరణశిక్ష పడితేనే విస్మయ ఆత్మ శాంతిస్తుందని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు అభిప్రాయపడుతున్నారు.కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన మోటార్‌ వెహికిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అయిన ఎస్ కిరణ్ కుమార్‌కు, విస్మయ వి నాయర్(23) అనే యువతికి మార్చి 2020లో పెద్దల సమక్షంలో వివాహమైంది. అల్లుడు ఆర్టీఏలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండటంతో కూతురికి మంచి సంబంధం దొరికిందని ఆమె తల్లిదండ్రులు సంబరపడిపోయారు. కట్నం కింద 100 సవర్ల బంగారం, ఎకరానికి పైగా భూమి, కారును కట్నంగా ముట్టజెప్పారు. అయితే ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన విస్మయకు కొద్దిరోజులకే వేధింపులు మొదలయ్యాయి. తనకు కట్నంగా ఇచ్చిన కారుకు బదులుగా నగదు కావాలని భర్త పట్టుబట్టాడు. దీనికి తోడు మరింత కట్నం తీసుకురావాలంటూ విస్మను చిత్రహింసలు పెట్టేవాడు. విస్మయ జూన్ 21 ఉదయం బాత్‌రూమ్‌లో ఉరేసుకుని కనిపించింది. విస్మయ ఆత్మహత్య చేసుకుందని ముందుగా అందరూ అనుకున్నప్పటికీ… ఆ తర్వాత ఆమె తన అన్నకు పంపించిన మెసేజ్‌లు, ఫోటోలు బయటికి రావడంతో కలకలం రేగింది. అందులో ఆమె మొహం, చేతులపై గాయాలున్నాయి. దీంతో తమ కూతురిని భర్త, అత్తమామలే చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ విస్మయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేరళ సర్కారు అతడిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించింది.

- Advertisement -

సింధూకు జగన్ సత్కారం

Tags:Shock to the awe-struck husband

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page