నిర్మల్‌లో వ్యాపారి కిడ్నాప్

0 30

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణలోని నిర్మల్ పట్టణం దివ్యానగర్‌లోని తన్వి అపార్ట్‌మెంట్‌లో ఉండే వ్యాపారి విజయ్ చందర్ దేశ్‌పాండేను దుండ‌గులు అప‌హ‌రించి తీసుకెళ్ల‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ రోజు ఉద‌యం 7 గంటలకు ఆరుగురు గుర్తు తెలియని వ్య‌క్తులు రెండు కార్లలో వచ్చి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఉన్న విజ‌య్ చంద‌ర్‌ను లాక్కొని కిందికి వచ్చి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ స‌మ‌యంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కూడా కిడ్నాప‌ర్లు బెదిరించిన‌ట్లు తెలిసింది. విజ‌య్ కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. గంజాల్ టోల్ ప్లాజా వద్ద కిడ్నాప‌ర్ల వాహనాల వివరాలు గుర్తించారు. సంగారెడ్డికి చెందిన కృష్ణారావును ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags: Merchant kidnapped in Nirmal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page