పుంగనూరు రెడ్డి జన సంక్షమ సంఘ ఆత్మీయ సమ్మెళనం

0 124

-రెడ్డి అంటేనే సహాయ స్ఫూర్తి కి నిదర్శనం..దేశానికి వెన్నెముక..

– పెద్ద ఎత్తున పాల్గొన్న రెడ్డి జనసందోహం..

 

- Advertisement -

పుంగనూరు ముచ్చట్లు:

 

 

 

పుంగనూరు రెడ్డి జన సంక్షమ సఘం ఆధ్వర్యంలో ఎన్ఎస్ పేట రామ్ నగర్ కాలనీ నందు గల రెడ్డి జన సంక్షమ సంఘ భవనం నందు ఆదివారం అతిథులుగా విచ్చేసిన పుంగనూరు అదనపు వైస్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి లలితమ్మ సి ఆర్ రాజారెడ్డి వారి చేతుల మీదుగా ప్రజాకవి, సంఘసంస్కర్త కొండవీటి వేమన రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.రెడ్డి ఆత్మీయ సమ్మెళన అధ్యక్షులు డా౹౹శరన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలియజేసారు. అనంతరం ఆయన రెడ్డి జన సంక్షమ సంఘ గూర్చి మాట్లాడుతూ రెడ్డి అంటేనే సహాయ స్ఫూర్తి కి నిదర్శనం అని ఎవరు ఎంతటి సమస్యలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుంటాడాని అన్నారు.ఐక్యత ఉంటేనే దేనినైనా మనం సాదించగలమని ముఖ్యంగా రెడ్డి జన సంక్షమ సంఘం ద్వార ఎందరో రెడ్డి బంధువులు ఒక్కటై ఇటు రెడ్డి సంఘం అభివృద్ధికి సామాజిక సేవ కార్యక్రమంలో ముందున్నారని కొనియాడారు.కరోన సమయంలో ఎవరికి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినదని, దీనితో పాటు ఎందరో పెద్దలను ఆత్మీయులను కోల్పోయమని వారందరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అందరు కలిసి రెండు నిమిషాలు నివాళులర్పించారు. రెడ్డి సంఘం ద్వారా ఇది వరకే పట్టణంలో ఉగాది సందర్భంగా కవులను సత్కరించమని, పేద విద్యార్థుల భవితకు బంగారు బాటగా అబుకాస్ విద్య సంస్థలో 30% డిస్కాంట్ తో విద్యను అందించడమే కాకా పేద విద్యార్థులకు సంస్థ తరపున మహిపాల్ రెడ్డి ఉచిత విద్యను అందిస్తారని తెలియజేసారు.

 

 

 

 

అలాగే రెడ్డి జనసంఘం తరపున ఒక చిన్న బిడ్డకు లివర్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయలను కేవలం రెండు రోజుల్లోనే వాట్సాప్ గ్రూపు ద్వారా తెలిపిన సమాచారనికి రెడ్డి మిత్రులు గా ముందుకొచ్చి ఆపరేషన్ కు ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు సహాయం చేయడం గర్వకారణం ఉందన్నారు.రెడ్డి సంఘ అభివృద్ధి దిశగా త్వరలో నే ఒక కల్యాణ మండపం ఏర్పాటుకు పెద్దలు అందరూ కలసి మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని సంప్రదించమని ఆయన సానుకూలంగా స్పందించి స్థల ఏర్పాటుకు కలెక్టర్ కు తెలిపరన్నారు.ఈ రెడ్డి జన సంఘ కల్యాణ మండపం ద్వారా వచ్చే నిధులు రెడ్డి సంఘ అభివృద్ధి మరియు పేదల సహాయకరంగా ఉపయోగించడానికి నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్  లలితమ్మ మాట్లాడుతూ పుంగనూరు రెడ్డి సంఘం ఎంత బలమైనదనడానికి కౌన్సిలర్ గా ఉన్న నాకు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడమే నిదర్శనం అని మా అందరి మీద నమ్మకం తో రెడ్డి సంఘం ద్వార ఈ గుర్తింపును అందించిన మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి మరియు ఎంపీ మిదున్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరాజు రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం అభివృద్ధి లో భాగంగా పుంగనూరు తిరుపతి రోడ్డు కూడలిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారి కౌంస్య విగ్రహా ఏర్పటుకు మంత్రి  దృష్టికి ప్రతిపాదనలు తీసుకువెళుతామని తెలిపారు.

 

 

 

 

సీనియర్ న్యాయవాది మల్లిజర్జున రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మును ముందుకు రెడ్డి సంఘం లోని ప్రతి ఒక్కరు మన సంఘం లో మరియు సమాజంలో ఉన్నతపదవులు అధిరోహించి ప్రజలందరికి వారి సహాయసహకారాలు అందుంచాలని మంచి పేరు తీసుకురావాలని కోరారు.కార్యదర్శి త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న రెడ్డి బంధు మిత్రులు భవిషత్తు లో రెడ్డి సంఘ అభివృద్ధి , సామాజిక సేవ,కరోన ప్రభావంతో నష్టపోయిన వారికి చేయూత, తదితర కార్యాచరణ విషయాల పై విరివిగా వారి వారి అభిప్రాయాలను కార్యక్రమంలోఅందరికి తెలియజేసారు. కార్యక్రమ తదనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి లలితమ్మ సి ఆర్ రాజారెడ్డి దంపతులకు దుశ్యాలువలు వేసి గజమాలలతో అభినందించి గౌరవసత్కార కార్యక్రమంలో రెడ్డి జనసంక్షేమ సంఘ రాజశేఖర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,మహిపాల్ రెడ్డి, బాలచంద్రా రెడ్డి,భాస్కర్ రెడ్డి, మంజునాథ్ రెడ్డి,రెడ్డి బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags: Punganur Reddy Jana Sankshama Sangha Atmiya Sammelanam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page