భోగస్ చలానాల కుంభకోణంలో ముగ్గురు సబ్‌ రిజిస్ర్టార్లు సస్పెన్షన్

0 29

కడప ముచ్చట్లు :

 

స్టాంపులు, రిజిస్ర్టేషన్‌ శాఖలో వెలుగు చూసిన బోగస్‌ చలానాల కుంభకోణంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడప అర్బన్‌ సబ్‌ రిజిస్ర్టార్లు చంద్రమోహన్‌, సుబ్బారెడ్డి, రూరల్‌ సబ్‌రిజిస్ర్టార్‌ హరికృష్ణతోపాటు జూనియర్‌ అసిస్టెంట్లు రత్నమ్మ, సుకుమార్‌లను సస్పెండ్‌ చేస్తూ ఆ శాఖ డీఐజీ గిరిబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ చలానాల స్కాంలో ఐదుగురు సస్పెండవడంతో రిజిస్ర్టేషన్ల శాఖలో కలకలం రేగింది. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో స్థిరాస్తులు, భూములు, ఇతర రిజిస్ర్టేషన్ల సమయంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ దిగమింగుతూ ఖజానాకు కన్నం వేస్తున్నారు. దీనిపై వార్తలు రావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టింది. నిజమేనని తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

Tags: Three sub-registrars suspended in Bhogas challan scandal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page