అడవి బిడ్డల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట: జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి

0 13

అసిఫాబాద్ కుమ్రం భీమ్ ముచ్చట్లు:

అడవి బిడ్డల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందాని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. జిల్లాలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంప్రదాయ బాజా భజంత్రీలు, నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసుల ఆరాధ్య దైవంగా కొలిచే ఆదివాసీ వీరుడు కుమ్రం భీమ్‌ విగ్రహానికి జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సమిష్టి జీవన పద్ధతులు, పరస్పర సహకారం, నిష్కలమైన జీవితాలకు సాక్ష్యాలు ఆదివాసులు అన్నారు. కార్యక్రమంలో అసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ, వైస్ చైర్మన్ గాదవెని మల్లేష్, అసిఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీ, ఆదివాసీ నాయకులు పెందూర్ సుధాకర్, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Government is a big platform for the promotion of wild children: ZP Chairperson Kova Lakshmi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page