అన్ని అసెంబ్లీ స్థానాల్లో ‘దళితబందు’ అమలు చేయాలి

0 13

హుజురాబాద్ ఎన్నికల ప్రకటనకు ముందే అమలు కావాలి
కలెక్టరేటు ఎదుట భారీ ధర్నా
షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి సాధన కమిటి డిమాండ్

జగిత్యాల ముచ్చట్లు:
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రకటన రాకముందే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో
దళిత బందు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి
సాధన కమిటి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్ నుంచి భారీ ర్యాలీగా బయలు దేరి కలెక్టరేలు ఎదుట మహాధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టరేటు
కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి సాధన కమిటి,
ఎమ్మార్పిఎస్ జిల్లా కన్వీనర్ గంగారాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల స్టంట్ లో భాగంగానే దళితబందు పథకాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. హుటాహుటిన పథకాన్ని కేవలం హుజురాబాద్ లోనే అమలు చేస్తు దళితులందరిలో అనుమానాలను కలిగిస్తోందన్నారు. గతంలోను దళితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి పథకం, హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పంటి సిఎం కేసిఆర్ గత ఏడేండ్ల కిందనే హామీ ఇచ్చి ఇప్పటికి అమలు కాలేదన్నారు. అందుకే సిఎం కేసిఆర్ మాట పై దళితులకు విశ్వాసం లేదని వెంటనే తెలంగాణాలోని 119 అసెంబ్లీ  స్థానాల్లో హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దళితబందు పథకాన్ని అమలు చేయాలని గంగారాం డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో ఉన్న 20 వేల దళిత కుటుంబాలకు వెంటనే దళితబందు పథకాన్ని అమలుచేసి ఆతర్వాతే రాష్ట్రంలోని 119 40 సెంబ్లీ స్థానాల్లో దళితబందు పథకాన్ని అమలు చేయాలని గంగారాం కోరారు. ఈ ధర్నాలో ఎమ్మార్పిఎస్ యువసేన జిల్లా ఇంచార్జీ నక్క సతీష్ మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి చెవులమద్ది
శ్రీనివాస్, మండల ఇంచార్జీలు సురుగు శ్రీనివాస్, బెజ్జంక్ సతీష్, ముల్కల శ్రీనివాస్, మీసాల సాయిలు, దీకాండ
మహేందర్, నిగ భూమేశ్వర్, ముప్పారపు స్వామి, జిల్లపెల్లి రవి, బోనగిరి కిషన్, బొల్లారపు దివాకర్, నాయకులు
చందు మాదిగ, బుడిగజంగాల నాయకులు, ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:‘Dalitbandhu’ should be implemented in all assembly seats

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page