అసత్య ఆరోపణలు చేస్తే నియోజకవర్గంలో తిరగబోయనియ్యం

0 40

— ఇసుక,ఎర్రచందనం,బియ్యం దందా చేసింది మీరే
–టిడిపీ నాయకుడు శ్రీనాథరెడ్డిపై రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఫైర్‌
— నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరికలు
–పద్దతి మార్చుకోవాలని చురకలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై , మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అసత్య ఆరోపణలు చేస్తున్న టిడీపీ నాయకుడు శ్రీనాథరెడ్డి ను పుంగనూరు నియోజకవర్గంలో తిరగబోనియ్యమని, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి హెచ్చరించారు. సోమవారం చౌడేపల్లెలో పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. సోమల మండలం కమ్మపల్లెలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అనవసరంగా పసలేని ఆరోపణలు చేయడం తగదన్నారు. టిడిపి ప్రభుత్వంలో అమరనాథరెడ్డితో కలిసి వారి అండతో ఇసుక, ఎర్రచందనంను అప్పలంగా అన్నదమ్ములైన మీరు కర్నాటకకు రవాణా చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. పనికి ఆహార పథకం ద్వారా కూలీలకు ఇచ్చిన రేషన్‌ బియ్యంను సైతం అమ్ము కొన్న నీఛ చరిత్ర ఉన్న మీరా పుంగనూరు నియోజకవర్గం గురించి మాట్లాడే దంటూఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంఅధికారం లోకి వచ్చాక పుంగనూరులో జరిగిన అభివృద్ది చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుగా లేదా అంటూ ప్రశ్నించారు. టిడీపీ ప్రభుత్వంలో దొంగలతో జతకట్టి దోచుకొన్న నీచులు మీరే అన్నారు. పుంగనూరులో పాలు విక్రయాలపై వివిధ డైరీలనుంచి రేట్లు తెలుసుకోవాలని,మంత్రి కు చెందిన డైరీలో అధిక రేటు్ల తో పాడి రైతులకు చెల్లిస్తున్నామని, పక్క డైరీలనుంచి వివరాలు తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఇసుక,ఎర్ర చ ందనం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నావో దమ్ముంటే ఒక రినైనా పట్టుకొని అప్పడు మీ నిజాయితీ నిరూపించాలని సవాల్‌ విసిరారు. కుళ్ళు రాజకీయాలు మానుకొని అభివృద్ది చేస్తున్నందుకు సంతోషించాలే కానీ అనవసర ఆరోపణలు చేయొద్దంటూ చురకలు అంటించారు. నోరు అదుపులొ పెట్టుకొని మాట్లాడాలని,లేకుంటే నియోజకవర్గంలో ఏ పల్లెలోనూ తిరగబోయనియ్యమని హెచ్చరికలు చేశారు. ఈ సమావేశంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, నేతలు కళ్యాణ్‌భరత్‌,రాయల్‌మోహన్‌,సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, జయచంద్ర తదితరులున్నారు.

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: False allegations are irreversible in the constituency

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page