ఆగ‌స్టు 20న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, 22న శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, 30న శ్రీ‌కృష్ణాష్ట‌మి

0 15

తిరుమల ముచ్చట్లు:

 

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆగ‌స్టు 20న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, 22న శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, 30న శ్రీ‌కృష్ణాష్ట‌మి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ఆల‌యాల్లో నిర్వహించనున్నారు. కోవిడ్-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌తో ఈ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.ఆగ‌స్టు 20న ఆయా ఆల‌యాల్లో అర్చ‌కుల చేత వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 21 ఆల‌యాల్లో భ‌జ‌న కార్య‌క్ర‌మం చేప‌డ‌తారు. ఆగ‌స్టు 22న శ్రావ‌ణ పౌర్ణ‌మి సంద‌ర్భంగా పండితుల చేత ధార్మికోప‌న్యాసం, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 30న శ్రీ‌కృష్ణాష్ట‌మినాడు ఆయా ఆల‌యాల్లో గోపూజ‌, ఉట్టి ఉత్స‌వం జ‌రుపుతారు. టిటిడి హిందూ ధర్మప్రచారం లో భాగంగా టీటీడీ లోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: Varalakshmi Vratham on 20th August, Sravana Poornami on 22nd and Sri Krishnashtami on 30th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page