ఆలయ చోరీని దాచి వుంచిన అధికారులు

0 23

కాకినాడ ముచ్చట్లు:

 

 

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహం అపహరణ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. -నిందితులను కఠినంగా శిక్షించాలి,భక్తుల మనోభావాలను కాపాడాలని  మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేసారు. బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి చోరీ గురైతే ఇవాళ్టి వరకు అది బహిర్గతం కాకుండా దేవాదాయ శాఖ అధికారులు కానీ , పోలీసు అధికారులు కానీ ఎందుకు జాగ్రత పడ్డారు. దేవాదాయ శాఖ అధికారులు మేము కంప్లైంట్ ఇచ్చాము పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదని చెబుతున్నారు, కొంతమంది పోలీసు అధికారులు అడిగితే  అదేమి బంగారం, వెండి కాదు కదా  అది రాతి విగ్రహమే కదా అని చులకనగా మాట్లాడటం జరుగుతుంది.ఇక్కడ రాతి విగ్రహమా, బంగారమా,వెండి అనేది కాదు ఇది భక్తుల మనోభావాలతో కూడుకున్న అంశం. ఈవేళ పోలీసు అధికారులను కానీ, దేవాదాయ శాఖ అధికారులను ప్రశ్నించేది ఒకటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, వైస్సార్ అధిష్టానం నుంచి ఏవైనా  ప్రత్యేకమైన ఇన్స్ట్రుక్షన్ ఏమైనా ఉన్నాయా? దేవాలయాలలో  చోరీ జరిగితే వాటిపై చర్యలు తీసుకోవొద్దు,ఆ విషయాలను పట్టించుకోవొద్దు అని ఏవైనా  ప్రత్యేకమైన ఇన్స్ట్రుక్షన్ మేరకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా.. ఒక ప్రాచీనమైన గుడిలో చాళుక్యుల కాలంలో నిర్మాణమైన గుడి,భక్తుల మనోభావాలతో ముడిపడిన ఒక   ధార్మిక సంస్థ అందులో ఒక విగ్రహం చోరీ అయితే ఇంత చులకనగా మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారని అన్నారు.
దీనిపైన ఎందుకు మూడు రోజులుగా గోప్యoగా ఉంచారు.దీని వెనుక ఆంతర్యం ఏమిటి? దీనిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దీనిని తక్షణమే బయట పెట్టాలి.నింధితులను సత్వరమే పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలి,హిందువుల మనోభావాలను పరిరక్షించాల్సిన  బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని డిమాండ్ చేసారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:The authorities who hid the temple theft

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page