ఉక్కు పరిశోధన రంగంలో సాధించిన పర్యావరణ హితమెంత ?

0 21

పార్లమెంట్లో ప్రశ్నించిన ఎంపీ ఆదాల
నెల్లూరు  ముచ్చట్లు:
పరిశోధనా రంగంలో గత రెండేళ్లలో, ఇంధన సామర్థ్యం, పర్యావరణ అనుకూల సాంకేతికత, అభివృద్ధి, ప్రాజెక్టుల ఆధునికీకరణ వివరాలు ఏమిటని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. గత రెండేళ్లలో ఉక్కు పరిశోధనా రంగంలో కేటాయించిన నిధులెన్ని అని కూడా అడిగారు. దీనికి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి  రామచంద్ర ప్రతాప్ సింగ్ సోమవారం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఉక్కు కర్మాగారాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ వంటి కొన్ని వ్యర్థాలను స్టీల్ ప్లాంట్ లో శుద్ధిచేసి, సిమెంటు పరిశ్రమలకు విక్రయిస్తున్నా మని పేర్కొన్నారు. రోడ్ల తయారీ- నిర్మాణం, వ్యవసాయం మొదలైనవాటిలో  స్టీల్ స్లాగ్ చక్కగా ఉపయోగించుకోవడానికి పరిశోధన- అభివృద్ధి రంగాల ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలిపారు. గత రెండేళ్ల (2020 -21) కి గాను 440 కోట్ల రూపాయలు ఆర్ అండ్ డి కి కేటాయించినట్లు పేర్కొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:What is the environmental benefit achieved in the field of steel research?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page