ఎన్నికల సమయంలోనే సంక్షేమ పథకాలు గుర్తుకోస్తాయి

0 17

మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా రామాయంపేటలో  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఉప ఎన్నికలు వస్తే నే ముఖ్యమంత్రికి సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి అని ప్రజలకు తాత్కాలిక పథకాలే కానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని అన్నారు.  హుజురాబాద్ ఖరీదైన ఎన్నిక, ప్రజలు సరైన సమయంలో దీటైన సమాధానం చెబుతారు, అని  అన్నారు. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. ఏడు సంవత్సరాల టిఆర్ఎస్ పాలన నిరంకుశంగా కొనసాగుతుందని అన్నారు. నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుంది. తెలంగాణలో ప్రజలు ఆశించింది ఒకటైతే కెసిఆర్ కొనసాగిస్తుంది మరొకటి దామోదర్ అన్నారు.  ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి నిరుపేదలు గుర్తుకొస్తారని అన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Welfare schemes are remembered during elections

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page