ఏరియా హాస్పిటల్ లోని  ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు పనులను పర్యవేక్షించిన జియం

0 15

పెద్దపల్లి ముచ్చట్లు:

ఆర్జి 1  ఏరియా హాస్పిటల్ లో నూతనంగా నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు పనులను ఆర్జి 1 ఏరియా జియం కె.నారాయణ, అధికారుల బృంధం తో కలిసి  సందర్శించటం జరిగింది. ఈ సందర్బంగా జిఎం కె.నారాయణ మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో సంస్థ సి&ఎండి శ్రీ ఎన్. శ్రీధర్ సింగరేణి వ్యాప్తంగా అనేక కరోనా కట్టడి చర్యలను చేపడుతున్నారని,  ఇందులో భాగంగా రామగుండం  ఏరియా 1లో నూతనం గా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, ఇట్టి ప్లాంట్ కు సంబందించిన యం(త పరికరాలు  వచ్చాయని, త్వరలో ఆక్సిజన్ ప్లాంట్ (పారంభించటం జరుగుతుందని జీఎం తెలిపారు. ఇట్టి ప్లాంట్ ను లాండ్ స్కై కంపెనీ, సికిందరాబాద్ వారిచే నిర్మిస్తున్నామని, ప్రతి గంటకు 45 క్యూభిక్ మీటర్లు ఆక్సిజన్ సరఫరా చేయటం జరుగుతుందని, ప్రతి నిమిషానికి 750 లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయటం జరుగుతుందని అన్నారు. గాలిలోని ఆక్సిజన్ ను గ్రహించటం ద్వారా ఉత్పత్తి అవుతుందని, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆక్సిజన్ ఎంతో ముఖ్యం అని, ఈ ఆక్సిజన్ ప్లాంట్ ల  వలన ఎందరికో (పాణ వాయువును అందించి వారికి పునః జన్మ అందించటం జరుగుతుందని జీఎం తెలిపారు. సింగరేణి సంస్థ  కార్మికుల సంక్షేమానికి ఎప్పటికప్పుడు ఎన్నో గొప్ప గోప్ప పనులకు చేపడుతుందని అన్నారు . ఈ సందర్బంగా పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనులకు సంబందించిన రిపోర్ట్ లను అందించాలని  అధికారులను అధెశించారు. ఈ కార్యక్రమములో ఎస్ ఓ టు జిఎం త్యాగరాజు, ఏరియా ఇంజనీరు రామ్ మూర్తి, డిజిఎం సివిల్ నవిన్, డిజిఎం ఏరియా వర్క్ షాప్ మధన్ మోహన్, పర్సనల్ డిజిఎం లక్ష్మి నారాయణ, డివైసిఏంఓ కిరణ్ రాజ్ కుమార్, అధికారులు  జితేందర్ సింగ్ ,సీనియర్  ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి , సంక్షేమాధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Jiyam supervised the setting up of the oxygen plant at Area Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page