కాణిపాకంలో స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

0 29

కాణిపాకం ముచ్చట్లు:

 

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి  వారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా వుంది.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన భాగ్యం  కల్పిస్తున్నామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేశు  ఒక ప్రకటనలో  తెలిపారు . ఈ  రోజు   కాణిపాకం దేవస్థానం నందు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుండి భక్తులు  అధిక సంఖ్యలో కాణిపాకానికి చేరుకొని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.  భక్తులకు క్యూలైన్లో  ఎటువంటి ఇబ్బంది కలగకుండా  ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూ  ను  మార్పులు చేయడంతో  అధిక సంఖ్యలో భక్తులు  కాణిపాకానికి రావడం జరుగుతుందని, వారికి ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని  కాణిపాకం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేశు తెలియజేశారు. శ్రీ స్వామివారి దర్శన వేళలు పెంచుతూ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వల్ప మార్పు చేయడం జరిగింది.  కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆలయ దర్శన ఈ వేళలో మార్పు చేసినట్లు భక్తులు గమనించాలని ఆయన తెలిపారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: Devotees flock to Swami’s darshan in Kanipakam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page