కొత్త కాలువ సెంటర్ లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు

0 16

నెల్లూరు  ముచ్చట్లు:
విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ మరియు నిత్య  వాణి పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టారు. నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని కొత్త కాలువ సెంటర్ ప్రాంతంలో ఉన్న ఎన్జీవో రమేష్ సహకారంతో మానవ సేవే మాధవ సేవగా తమ వంతు సేవలందించారు. ఇందులో భాగంగానే మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్జీవో రమేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 మార్చి నుండి ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా, అనేక మంది ప్రాణాలను బలిగొందన్నారు. ఈ నేపథ్యంలో మిత్రులను, బంధువులను, ఆప్తులను అనేకమంది  శాశ్వతంగా దూరం కావడం బాధాకరమన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి తమ నిధులను నిర్వహించుకోవాలని సూచించారు. తమ తమ పరిసర ప్రాంతాలతో పాటు తమ ఇండ్లను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లాక్ డౌన్ పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధినేత తాళ్లూరి సువర్ణ కుమారి, నిత్య వాణి ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ ర్ ల తో పాటు ఫ్రెండ్స్ ఆన్ పౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ బాబు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Corona virus control measures in the new canal center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page