టిప్పర్ కు విద్యుత్ షాక్ తగలడంతో ముగ్గురు మృతి …

0 43

 

పాలసముద్రం  ముచ్చట్లు:

- Advertisement -

మండలంలోని వెంగళరాజుకుప్పం పంచాయతీ కనికాపురం గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన..
ఇంటి అవసర నిమిత్తం టిప్పర్ లారీలో తీసుకొచ్చన కంకరను గ్రామంలో దింపే సమయంలో పైన 33/11కేవి విద్యుత్ తీగలు టిప్పర్ కు తగలడంతో డ్రైవర్ కు షాక్ గురైంది . డ్రైవర్ కేకలు వేయడంతో పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు స్పందించి కాపాడే దానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వెంగళరాజుకుప్పం పంచాయతీ కనికాపురం గ్రామానికి చెందిన జ్యోతీశ్వర్(19) ఇంటర్ పూర్తి , దొరబాబు ( 23), బిటెక్ పూర్తి , గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు పెద్ద కాలువ గ్రామానికి చెందిన డ్రైవర్ మనోజ్ ( 34) మృతి చెందారు. గ్రామంలో తీవ్ర విషాదచాయలు నెలకొంది. స్ధానిక పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు.

 

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Three killed in electric shock to tipper

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page