డిగ్రీ  సెమిస్టర్ ఎగ్జామ్స్ వెంటనే రద్దు చేయాలి  

0 19

ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షుడు సదుల వినయ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కు వినతిపత్రం

కోరుట్ల ముచ్చట్లు:

- Advertisement -

డిగ్రీ  సెమిస్టర్ ఎగ్జామ్స్ వెంటనే రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఎన్.ఎస్.యూ.ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సదుల వినయ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో  కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సదుల వినయ్ మాట్లాడుతూ కరోనా వల్ల గత పది నెలల నుండి విద్యాసంస్థలు మూత పాడడం వల్ల విద్యార్థులందరూ ఇంటికే పరిమితి అయ్యారని, ఆన్లైన్ క్లాసెస్ వల్ల గ్రామీణ ప్రాంతం లో ఉండే విద్యార్థులులకు ఇంటర్నెట్ లేక ఆన్లైన్ క్లాసెస్ వినలేకపోయారని ఆయన ఆన్నారు. సిలబస్ కూడా పూర్తి కాకుండా ఎగ్జామ్స్  ఎలా పెడుతారని అన్నారు.  విద్యార్థులకు ఎగ్జామ్స్  పెడితే విద్యార్థుల బ్రతుకులు ఆగం అవ్వుతాయి ఈ కారోనా సమయంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే అవకశాలున్నాయిని , దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 12 నుండి జరుగబోయే డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వెంటనే రద్దు చేయాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జాకీ సల్మాన్ ,అబ్రార్, ఇమ్రాన్, సాజీద్, ఖాలీద్ ,అబ్దుల్ రహమాన్, హస్సన్ ,గంగాధర్, సాఫీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:Degree semester exams should be canceled immediately

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page