తెరాసలోనే వుంటాను;ఎమ్మెల్యే రాజయ్య

0 22

హైదరాబాద్  ముచ్చట్లు:
సోషల్ మీడియా- మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేశారు. * లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారు.  గతంలో ఓ క్రైస్తవ సమావేశం సందర్భంగా కలిసిన ఫోటోను వైరల్ చేశరని ఎమ్మెల్యే ,మాజీ ఉప ముఖ్యమంత్రి టి .రాజయ్య అన్నారు. సోమవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  వైఎస్సార్ పై నాకు అభిమానం ఉన్నది వాస్తవమే.  వైఎస్ నాకు టికెట్ ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారు.  జగన్మోహన్ రెడ్డి తో కూడా నా సావాసం గతంలో ఉండేది.  సోనియాగాంధీ ప్రవర్తన వల్ల తెలంగాణ కోసం జగన్మోహన్ రెడ్డి ని పక్కనబెట్టి బయటకు వచ్చాను.  జగన్మోహన్ రెడ్డినా- తెలంగాణనా అంటే  తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసాను.  టీఆరెస్ లో కేసీఆర్ నాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు.  నాకు ఇష్టమైన వైద్య ఆరోగ్య శాఖను, డిప్యూటీ సీఎం హోదా కేసీఆర్ నాకు కల్పించారు. * నేను రాజకీయ ఓనమాలు దిద్దింది కాంగ్రెస్ పార్టీ అయితే ఎదుగుదల మాత్రం టీఆరెస్ వల్లే. నా జీవితాంతం టీఆరెస్ పార్టీలోనే ఉంటానని అన్నారు.  రాజకీయంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి- అలానీ రాజకీయం చేయొద్దు.  దళితవాడల్లో నిద్రచేసి ఒక పుస్తకం రూపంలో సీఎంకు నేను ఇచ్చాను- ఇవ్వాళ దళితబంధు అమలు కావడం సంతోషకరంగా ఉంది.  దళితబంధు పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు.  మూడెకరాల పంపిణీ సక్సెస్ కాలేదని దళిత్ ఎంపవరమెంట్ సీఎం స్టార్ట్ చేశారు.  దళితపథకాలు అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లడం లేదనే సీఎం దళితుల కోసం ప్రత్యేక పథకాలు తెస్తున్నారు.  జనాభాలో 20శాతం ఉన్న దళితులకు వందశాతం న్యాయం జరగలేదనే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు.  ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో టాప్ 5 ఎమ్మెల్యేల్లో నేను 4వ స్థానం నాకు దక్కింది. తప్పుడు ప్రకటనలు చేసి మనోభావాలను- మనసును గాయం చేయొద్దు. * ప్రజలు ఇచ్చే తీర్పుకు రెఫరెండం గా స్వాగతిస్తాం.  అసత్య వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను.  వైఎస్సార్ తో సన్నిహిత సంబంధాలే ఇలాంటి వార్తలకు కారణం అవుతున్నాయి.  నేనంటే పడనోళ్లు- దళిత వ్యతిరేకులు చేస్తున్నారని అనుమానం.  నేను ఎలాంటి అసంతృప్తిలో లేను- చాలా తృప్తిగా ఉన్నాను.  నేను డిప్యూటీ సీఎం అయిందే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు టీఆరెస్ పార్టీలోనే ఉంటాను.  షర్మిలను నేను కలవలేదు- అలాంటి అవసరం రాలేదు.  బీఎస్పీ ఉన్న ఎక్కడైనా దళితబంధు ఉందా?- బీఎస్పీ పార్టీకి ఇక్కడ ఆదరణ ఉండదని అయన అన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:I will be in Teresa; MLA Rajaya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page