నాపై పోటీ చేసి గెలవండి : కేసీఆర్, హరీశ్‌రావుకు ఈటల సవాల్

0 27

తెలంగాణ ముచ్చట్లు :

 

బీజేపీ నేత ఈటల రాజేందర్ తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులను లక్ష్యంగా చేసుకున్నారు. హుజూరాబాద్‌ మండలం చెల్పూరు పంచాయతీలోని ముదిరాజ్‌లు నిన్న ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనపై నేరుగా పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. తనను బక్కపల్చని పిల్లగాడు, దిక్కులేని పిల్లగాడు అని అంటున్నారని, కానీ హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని అన్నారు. ఓటుకు రూ. 10 వేలు ఇచ్చినా సరే ప్రజల గుండెల్లోంచి తనను తుడిచేయలేరని స్పష్టం చేశారు. తాను మచ్చలేని వ్యక్తినని, కక్ష గట్టి తనను తప్పించారని ఆరోపించారు.

- Advertisement -

ఆగ‌స్టు 11వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tags: Compete against me and win: Eeta challenge to KCR, Harishrao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page