న్యాయమూర్తి కేశవరావు మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

0 16

హైదరాబాద్ ముచ్చట్లు:
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పొట్లపల్లి కేశవరావు మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు  అందించిన న్యాయ సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. జస్టిస్ పొట్లపల్లి కేశవరావు 1961 మార్చి 29న జన్మించారు. హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వరంగల్ జిల్లాలో పి.సాంబశివరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1991లో హైదరాబాద్కు ప్రాక్టీస్ మార్చి, ఎంవీ రమణారెడ్డి ఆఫీసులో చేశారు. 1996లో స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులు, ఎన్నికల కేసుల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2010లో సీబీఐ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు. అనేక సంచలన కేసుల్లో వాదనలు వినిపించారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారని మంత్రి వివరించారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Minister Errabelli mourns the death of Justice Keshavarao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page