పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి

0 24

పరిగి ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జలసాధన సమితి ఏర్పాటు చేసిన కృష్ణాజలలో  పూర్తిగా వినియోగం,  పాలమూరు ఎత్తిపోతల సాధన అమలుకు  సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి పరిగి మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాదయాత్రగా సమావేశం ప్రాంగణానికి  చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆపివేసి  కాళేశ్వరం ప్రాజెక్టు  పూర్తిచేశామని చెప్పుకుంటూ  ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపంచారు.  కాళేశ్వరానికి లక్ష కోట్లు పెట్టినప్పుడు, ఉమ్మడి రంగారెడ్డి , మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాలకు సాగునీరు  తాగునీరు అందించే పాలమూరు ప్రాజెక్టు కేవలం 10 వేల కోట్లు పెట్టి నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.  పనులు ప్రారంభించి ఏడు సంవత్సరాలు గడిచినా చుక్క నీరు కూడా  వికారాబాద్ జిల్లాకు రాలేదని అన్నారు., ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులు  చేయని ద్రోహం   ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని, సత్వరమే ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి  ప్రసాద్ కుమార్, జలసాధన సమితి అధ్యక్షుడు  వెంకట్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

- Advertisement -

Tags:Work on the Palamuru-Rangareddy project should begin

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page