పుంగనూరు లో అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవంను ఘనంగా నిర్వహించినగిరిజన నాయకులు

0 19

పుంగనూరు ముచ్చట్లు:
అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం ఆగస్టు 9వ తేదీన పుంగనూరు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ ,గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు మూడే నాగే నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లో ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9వ తేదీ ఆదివాసులు గిరిజనులకు ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన రోజు అని చెప్పారు, ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగంలో ఆదివాసుల కొరకు ఎన్నో చట్టాలు మరియు హక్కుల ఏర్పాటు చేయడం జరిగినది అని ఆ యొక్క హక్కులను ప్రతి ఆదివాసి కుటుంబాలు ఐక్యంగా సాధించుకోవాలని చెప్పారు, ముఖ్యంగా సహజ సంపద కాపాడుతున్నది ఆదివాసుల అని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, ఎం నాగే నాయక్, సర్పంచులు ఎం శ్రీనివాస్ నాయక్, భీమానాయక్ ఎంపీటీసీ బి ప్రభాకర్ నాయక్, ఎక్స్ కౌన్సిలర్ బి నాగు నాయక్, శ్రీ నా నాయక్, క్రిష్ణ నాయక్ మరియు దళిత నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు..

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Tribal leaders celebrated International Tribal Day in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page