బోలేరో బీభత్సం…ఒకరు మృతి..మరోకరికి తీవ్రగాయాలు

0 28

గన్నవరం  ముచ్చట్లు:
కృష్ణాజిల్లా  గన్నవరం పెట్రోలు బంకు సమీపం గల సంగం డైయిరీ పార్లర్ వద్ద జాతీయ రహదారి పై బోలేరో వాహనం బీభత్సం సృష్టించింది. బోలేరో వాహనం అదుపు తప్పి ఒక ద్విచక్రవాహనాన్ని, నడుచుకుంటూ వెళ్తున్న మరో పాదచారిని  ఢికొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గన్నవరం మండల దావాజీగూడెంకి చెందిన  కొండయ్య(60) గా గుర్తించారు. . మృతుడు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. బైక్ పై ప్రయాణం చేస్తున్న వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి.  సమాచారం అందుకున్న గన్నవరం ఎస్.ఐ పురుషోత్తమ్ ప్రమాదస్ధలానికి చేరుకుని గాయపడిన వ్యక్తి ని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి గన్నవరం ఎస్సీకాలనీ కి చెందిన తిరువీధి రవి (48)..పోస్టుమార్టం నిమిత్తం కొండయ్య మృతదేహాన్ని  ప్రైవేటు వాహనంలో  గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  హైవే పెట్రోలింగ్ సిబ్బంది వాహనాలకు ఇబ్బంది  లేకుండా క్లియర్ చేశారు.  పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు   ఎస్ఐ రమేష్ తెలిపారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Bolero harassment… One killed..the other seriously injured

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page