మూడు కుటుంబాల సాంఘీక బహిష్కరణ

0 18

కామారెడ్డి    ముచ్చట్లు:
ఓ భూవివాదం విషయంలో కుల పెద్దలు మూడు కుటుంబాలను బహిష్కరించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. అ bకిటి రవీందర్ రెడ్డి, గుట్టకాడి  రామ్ రెడ్డి, అకిటి శ్రీకాంత్ రెడ్డి ల కుటుంబాలను కులస్తులు బహిష్కరించారు. ఈ కుటుంబాలతో ఎవరు మాట్లాడిన మంచి చెడులకు వెళ్లిన 10 వేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు తీర్మానం సైతం చేశారు. ఈ విషయంపై రవీందర్ రెడ్డి తసీల్ధార్ కు ఫిర్యాదు చేశాడు. తాడ్వాయి మండల కేంద్రంలో మూడు కుటుంబాలను కుల పెద్దలు  కుల బహిష్కరణ చేశారు. బాధితుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాడ్వాయి గ్రామానికి చెందిన రామ్ రెడ్డి, సావిత్రి లు భార్యాభర్తలు. వీరికి సరిత, స్వాతి  ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహా ని సైతం చేశారు. అయితే వీరికి సుమారు 19 ఎకరాల భూమి ఉండడంతో పెద్ద అల్లుడైన అకిటి రవీందర్ రెడ్డి సాగుచేస్తూ అత్తమామలకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే ఈ భూమిలో ఒక ఎకరం 30 గుంటలు భూమి తమదంటూ బంధువులైన గుట్టకాడి మణెమ్మ కుమారులు స్వామి, సంజీవరెడ్డి, రంజిత్ రెడ్డి లు గత ఎనిమిది నెలల క్రితం అకిటి రవీందర్ రెడ్డి తో పాటు అత్తమ్మ అయిన సావిత్రి పై దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. దీంతో రవిందర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పెద్దల సమక్షంలో మాట్లాడుకునేందుకు వెళ్లగా కుల పెద్దలు సైతం స్వామి, సంజీవరెడ్డి, రంజిత్ రెడ్లకు సపోర్ట్ గా మాట్లాడారు. అంతేకాకుండా ఒక ఎకరం 30 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి లేకుంటే లక్ష రూపాయల జరిమానా కట్టాలని తీర్మానం చేశారు. అయితే రవిందర్ రెడ్డి రిజిస్టేషన్ చేసేందుకు నిరాకరించి లక్ష రూపాయలు కట్టేందుకు సిద్ధమయ్యాడు. లక్ష రూపాయలు కట్టేందుకు వెళ్లిన రవిందర్ రెడ్డిని కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించి తీర్మానం చేశారు. రవిందర్ రెడ్డి కుటుంబంతో పాటు మామ రామ్ రెడ్డి తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి ల కుటుంబాలను కులస్తులు బహిష్కరించారు. దీంతో గ్రామంలో కుల స్తులు ఎవరు మూడు కుటుంబాల తో మాట్లాడడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీరితో  మాట్లాడిన మంచి చెడుకు వెళ్లిన పదివేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తీర్మానం చేశారు. దీనికి తోడు రవీందర్ రెడ్డి కి ఉన్న ఫర్టిలైజర్ దుకాణంలొ ఎవరూ కొనుగోలు చేయవద్దని కొనుగోలు చేసిన వారికి పది వేలు జరిమానా విధిస్తామని సూచించారు. దీంతో ఆందోళనకు గురైన రవిందర్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కుటుంబాలు తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Social exclusion of three families

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page