యూరియా పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు

0 19

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్

కామారెడ్డి ముచ్చట్లు:

- Advertisement -

కామారెడ్డి జిల్లాలో సోమవారం నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తన చాంబర్లో జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా లీడ్ బ్యాంకు అధికారితో జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ పరిస్థితులను, పంట రుణాల ఖాతాలను సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు వచ్చిన యూరియాను అవసరానికి అనుగుణంగా డీలర్లకు, సహకార సంఘాలకు సరఫరా జరిగే విధంగా చూడాలని, ఎక్కడ కూడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు ఇచ్చిన అలాట్మెంట్ ను సక్రమంగా పొందాలని,  జిల్లా కలెక్టర్ సూచించిన ఆదేశాల మేరకు రైలు పాయింట్ ఆఫీసర్ కేటాయింపులు జరపాలని ఆదేశించారు. ఈసందర్భంగా కామారెడ్డి వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ను రైలు పాయింట్ ఇంచార్జి ఆఫీసర్ గా  నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డివిజన్ ప్రకారం వచ్చిన వచ్చిన యూరియా స్టాకును పంటల సాగు నిష్పత్తిలో పంపిణీ చేయాలని తెలిపారు.  ప్రైవేటు డీలర్లు లేనిచోట ప్రాథమిక సహకార సంస్థలకు అప్పగించాలని తెలిపారు.  క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేటు డీలర్లు,  సహకార సంస్థలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని,  ఇప్పటి వరకు 38 వేల 347 మెట్రిక్ టన్నుల  యూరియా రాగా  35 వేల 732 మెట్రిక్ టన్నులు పంపిణీ  జరిగిందని,  2614 మెట్రిక్ టన్నులు యూరియా బ్యాలెన్స్ ఉందని తెలిపారు.పంట రుణాలు సంబంధించి 1,98,700 ఖాతాలు ఉన్నాయని, వీటిలో 7650 ఖాతాలు సరిగా లేనందున వీటిని రేపటిలోగా బ్యాంకుల సమన్వయంతో పరిశీలించి మొత్తం ఖాతాలను ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా లీడ్ అధికారి  రాజేందర్రెడ్డి, కామారెడ్డి ఏ డి ఏ శశిధర్ రెడ్డి, బిచ్కుంద ఏడిఏ ఆంజనేయులు,  బాన్సువాడ ఏడిఏ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Strict action in case of any complaints regarding urea distribution

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page