శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

0 50

ఆలయానికి మొదటిరోజు పోటెత్తిన భక్తులు
శ్రీశైలం  ముచ్చట్లు:
శ్రీశైలం ఆలయంలో శ్రావణమాసోత్సవాలు  ప్రారంభమయ్యాయి. భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. వేకువజామున నుంచే భక్తులు ఆలయ క్యూలైన్లలో భారులు తీరారు. శ్రావణమాసం మొదటిరోజు అందులోను మల్లికార్జునస్వామి వారికి ప్రీతికరమైన రోజు సోమవారం కాడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు.  భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఉదయం నుంచి భక్తులు శ్రావణమాసోత్సవ ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. కరొనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు దరించి సామాజిక దూరంలో క్యూలైన్ల నుంచి స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు. స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకుంటున్నారు. శ్రావణమాసం మొదటి రోజు కావడంతో ఆలయ దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి స్వామివారి దర్శనానికి 6 గంటలు సమయం పడుతుంది. సీఘ్ర దర్శనానికి రెండు గంటలు పడుతుంది. వేకువజామున నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బిస్కట్ పాకెట్లు, పాలు,  పులిహోర,  మజ్జిగ,  మంచినీళ్లు అందిస్తూ భక్తుల సేవలో అధికారులు నిమగ్నమయ్యారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు రధ్దీకి అనుగుణంగా క్యూలైన్లను అధికారులు ప్రత్యేకంగా పర్వవేక్షించారు.

 

జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటిని సన్మానించిన అకాడమీ సంస్థల అధినేత చంద్రమోహన్ రెడ్డి 

- Advertisement -

Tags:Shravanam is the beginning of special pujas in Srisailam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page