సేవ్ ఇండియా  అనే నినాదంతో  రాస్తారోకో

0 19

అంబేద్కర్ సర్కిల్ భారీగా నిరసనలు, రాస్తారోకోలు

కౌతాళం ముచ్చట్లు:

- Advertisement -

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణలు బిల్లు వెనక్కి తీసుకోవాలని, రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని, రైతులందరికీ సాగునీరు అందించాలని గత ఎనిమిది నెలలుగా ఢిల్లీలో రైతుల పోరాటం చేస్తున్న మోడీ, అమిత్ షా పట్టించుకోవడంలేదని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య దుమ్మెత్తి  పోషారు. కార్మికులకు లేబర్ కోడ్ రద్దు చేయాలని ప్రైవేటీకరణ విరమించుకోవాలని కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.మోడీ ప్రభుత్వం కార్పొరేట్ లకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు అవలంభిస్తున్నారు. కరోనా పేరుతో దేశాన్ని  దివాలా తీయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకున్నది. దేశంలో ప్రభుత్వం అనే పదం లేకుండా మొత్తం ప్రభుత్వరంగ లన్నిటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో అప్పజెప్పడానికి బిజెపి పూనుకున్నది. మూడు వ్యవసాయ చట్టాలు అమలు చేస్తే రైతులకు మద్దతు ధర పంటల కొనుగోలు చేసే మార్కెటింగ్ కమిటీలు బలహీనపడి ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేసుకోవడానికి పరోక్షంగా బిజెపి ప్రభుత్వము పూనుకున్నది.
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధానాలకు బిజెపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిధులలో కోత పెడుతూ, పని దినాలు 200 రోజులకు పెంచాలని ,కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, వేతనాలు చెల్లింపుల్లో కులాల సమస్యలు ముందుకు తెచ్చి ఎస్సీ ,ఎస్టీల ను వేరుగా చెల్లింపులు చేసి కష్ట జీవుల మధ్య చిచ్చు పెట్టడానికి బిజెపి ప్రభుత్వం పూనుకున్నది. కరోనా సమయంలో బిజెపి ప్రభుత్వము ప్రజలను ఆదుకోలేదు, కరోనాను నియంత్రించడంలో గోరంగా విఫలమైనది. వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో పేద ప్రజలు చనిపోయినారు .లక్షలాదిమంది అనారోగ్యంతో అప్పులపాలై నిరాశ్రయులయ్యారు.కీలక సమయంలో బిజెపి ప్రభుత్వము ప్రజలను ఆదుకోవడంలో విఫలమైనది అందుకు వామపక్ష ప్రజా సంఘాలు అన్ని ముందుకు వచ్చి సేవ్ ఇండియా అనే నినాదంతో  ఈ దేశంలో ఉండే ప్రజలను మేమే రక్షించుకుంటాం అని నినాదాలు చేస్తూ అంబేద్కర్ సర్కిల్ దగ్గర గంటసేపు రాస్తారోకో చేయడమైనది.ఈ  రాస్తారోకోలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు  మల్లయ్య, రైతు సంఘం నాయకులు ఉలిగయ్య మారెప్ప, రామాంజనేయులు, రైతు కూలీ సంఘం నాయకులు జగదీష్, నాగేంద్ర,ఉలిగయ్య, భాష, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వీరేష్, వెంకన్న, గ్రామ సంఘ నాయకులు నాగరాజు, మారెప్ప, ఈరన్న, డప్పు న సంఘం నాయకులు మారెప్ప, మూ కప్ప, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు వీరేష్, ఈరన్న, ఆటో యూనియన్ నాయకులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Rastaroko with the slogan Save India

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page