హిందూ సమాజ స్వాప్నికుడు స్వామి వివేకానంద

0 13

కామారెడ్డి ముచ్చట్లు:

హిందూ సమాజ స్వప్నికుడు స్వామి వివేకానంద అని శ్రీ శ్రీ శ్రీ వేద శాస్త్ర గురుజి వేద విశ్వ శ్రవా  అన్నారు. జిల్లా లోని రామారెడ్డి లో ఏర్పాటు చేసిన  యజ్ఞ కార్యక్రమాలలో శ్రీ శ్రీ శ్రీ వేద శాస్త్ర గురుజి వేద విశ్వ శ్రవా
దంపతులు పొల్గొని యజ్ఞ పూజలు నిర్వహించారు. అనంతరం వేద శాస్త్ర గురూజీ శ్రీ శ్రీ శ్రీ వేద విశ్వ శ్రవా ప్రసంగిస్తూ,
హిందూమతం లేదా హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం అని అన్నారు.  హిందూ మతం అతి పురాతన ధర్మం అని అన్నారు.  దీనినే ‘సనాతన ధర్మం’ అని కూడా తరచు చెప్పబడుతుందన్నారు.  ధర్మము అనగా ఆచరణీయ కార్యం  మతమనగా అభిప్రాయము.హిందూ అనే పదమును పార్శీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి పార్శీ భాషలో సింధు అని అర్థము అని చెప్పారు. సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు కాని ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారని అన్నారు. హిందూమతం, దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవని అన్నారు. హిందూమతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూ దేశం అని అన్నారు.  905 మిలియన్లు భారతదేశం, నేపాల్ లోనే నివసిస్తున్నారని అన్నారు.హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సూరినాం, గయానా,ట్రినిడాడ్, టుబాగో, అమెరికా, రష్యా, చైనా ముఖ్యమైనవి అని తెలిపారు.హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను  గుర్తుంచుకోవలన్నారు.  ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు, ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయని అన్నారు. సాంప్రదాయం ప్రకారం వేదాలు, ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు, మహా కావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోందని అన్నారు.వేదాలు నాలుగు. అవి (1) ఋగ్వేదము, (2) సామవేదము, (3) యజుర్వేదము, (4) అధర్వణవేదము.అన్నింటికన్నా మొట్టమొదటిది, ముఖ్యమైనది ఋగ్వేదము. ప్రతి ఒక్క వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని సంహిత అంటారు. ఇందులో పవిత్రమైనటువంటి మంత్రాలు లిఖించబడి ఉంటాయి. మిగతా మూడు భాగాలలో వ్యాఖ్యానాలు ఉంటాయి. సంహితం మిగతా మూడు బ్రాహ్మనలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మొదటి రెండు భాగాల్ని కర్మకాండలు అనీ తరువాతి రెండు భాగాలను జ్ఞానకాండలు అనీ పిలుస్తారు. కొన్ని భాగాలు కర్మకాండలను గూర్చి ప్రస్తావిస్తే ఉపనిషత్తులు ఆధ్యాత్మిక థృక్కోణాన్ని, తత్వశాస్త్ర బోధనలను,, బ్రహ్మము, పునర్జన్మను గూర్చి ప్రస్తావిస్తావించబడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద నరేంద్ర ఆచార్య పండితులు అధ్యక్షులు పద్మా శ్రీనివాస్ ఆర్య ఉపాధ్యక్షులు గంగారాం ఆర్య కోశాధికారి జగదీశ్వర్ ఆర్య సలహాదారులు గుండ హరినాథ్ ఆర్య వడ్ల సత్యనారాయణాచార్య గ్రామ సర్పంచ్ సంజీవ్ ఉప సర్పంచ్ ప్రసాద్ మాజీ ఉప సర్పంచ్ శైలజా శ్రీనివాస్ రవీందర్ గౌడ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Swami Vivekananda was the dreamer of the Hindu community

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page