అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలి

0 36

చౌడేపల్లి ముచ్చట్లు :

 

అర్హులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా పని చేయాలని ఎంపీడీవో శంకరయ్య సిబ్బందికి సూచించారు. మంగళవారం గ్రామ సచివాలయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు కార్యాలయంలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్య వచ్చిన వెంటనే పరిశీలించి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ది పొందిన వారి వివరాలు కార్యాలయం లో నోటీస్ బోర్డు వివరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాలంటీర్ ల సహకారంతో వారికి కేటాయించిన గృహాలలో అర్హులందరికీ పథకాలు అందించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి సహకరించాలని కోరారు. పంచాయతీ కేంద్రంలో ఉన్న ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ వెంకటరమణ వెల్ఫేర్ అసిస్టెంట్ మోహన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Welfare schemes should work to ensure that all are eligible

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page