ఇంటి ముందుకే మార్కెట్

0 19

మెదక్ ముచ్చట్లు:

రోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రజలు గడప దాటాలన్నా భయ పడుతున్నారు. ఇంటి సమీపంలో వారం వారం జరిగే సంతలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ఒక వేళ ఆ సంతలలో జనసమూహం ఎక్కువ ఉంటే పోలీసు వారి హడావిడి ఎక్కువవటంతో అక్కడకు ఎవరూ వెళ్లటం లేదు. దీంతో ఇంటి వద్దకే వచ్చ కూరలు అమ్మే పాత పద్ధతి తెరపైకి వచ్చింది. ఇంటి వద్దకే కూరలు రావటం… బయటకు వెళ్లాల్సిన అవసరం లేక పోవటం..తక్కువ ధరకే కూరలు లభించటంతో వినియోగదారులు వీటిపైనే మొగ్గు చూపిస్తున్నారు.వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా, లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు రైతు బజార్లను విశాలమైన మైదానాలు, ఆటస్ధలాల్లోకి మార్చాయి. హైదరాబాద్ మహానగరంలో 12 రైతు బజార్లు ఉండగా, ప్రతి రైతు బజారు నుంచి 20 మొబైల్ వాహనాల ద్వారా కాలనీలు, గేటెడ్ కమ్యునిటీల్లోకి కూరలు పంపించి విక్రయించింది ప్రభుత్వం.లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో 250 మొబైల్ రైతు బజార్ల ద్వారా 800 ప్రాంతాల్లో విక్రయాలు జరిగాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక రైతు బజార్లు తిరిగి ప్రారంభమయ్యాయి.కానీ జనసర్ధం పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. మాస్క్ లు ధరించకపోవటం, భౌతిక దూరం పాటించకపోవటం వంటి నిర్లక్ష్య ధోరణి వల్ల కరోనా కేసులు పెరిగాయి. ఒకానొక దశలో పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు రాకపోవటంతో …కూరగాయలు డిమాండ్ కు సరిపడినంత లేకపోవటంతో రేట్లు విపరీతంగా పెరిగాయి.అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక రైతులే నేరుగా ద్విచక్రవాహనాలపై ఇళ్లవద్దకు వచ్చి విక్రయించటం మొదలెట్టారు. తద్వారా దళారుల బెడద తప్పింది. తాము అనుకున్న ధరలకే విక్రయించటంతో వారికీ బాగా కలిసోచ్చింది. ఇలా రోజుకు 20-30 కిలోల కూరగాయలు వారు తక్కువ సమయంలో విక్రయించ గలుగుతున్నారు.ఇంటి వద్దకే కూరలు రావటం, నేరుగా రైతులే అమ్మటంతో కూరగాయల ధరలు దిగివచ్చాయి.సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్‌ వంటి పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు కూరగాయల జాబితాను వాట్సాప్‌ మెసేజ్‌గా పంపిస్తే.. ఇంటికే డోర్‌ డెలివరీ అవుతున్నాయి.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:Home advance market

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page