ఇక నుంచి వాట్స‌ప్ వెబ్‌లోనూ ఫోటోల‌ను ఎడిట్

0 14

న్యూ ఢిల్లీ   ముచ్చట్లు:
వాట్స‌ప్ తాజాగా స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్స‌ప్ వెబ్ 2.2130.7 కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. అయితే.. ఈ కొత్త వ‌ర్ష‌న్ వెబ్‌/ డెస్క్‌టాప్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. ఆ ఫీచ‌రే డ్రాయింగ్ టూల్స్. అయితే.. ఈ ఫీచ‌ర్ ఇప్పుడే అంద‌రికీ అందుబాటులో ఉండ‌దు. దీని బీటా వ‌ర్ష‌న్‌ను మాత్ర‌మే విడుద‌ల చేస్తున్నారు. దీని వ‌ల్ల‌.. సెలెక్టెడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తుంది. వాట్స‌ప్ ఇప్ప‌టికే వ్యూ వ‌న్స్, న్యూ ఆర్కైవ్ అనే కొత్త ఫీచ‌ర్ల‌ను ఇటీవ‌లే తీసుకొచ్చింది. తాజాగా.. వాట్స‌ప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యూజ‌ర్లు ఫోటోల‌ను ఎడిట్ చేసుకునే ఫీచ‌ర్ డ్రాయింగ్ టూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచ‌ర్ ద్వారా ఎవ‌రికైనా ఫోటోను షేర్ చేసేట‌ప్పుడు.. ఆ ఫోటోను ఎడిట్ చేసే కొన్ని ఆప్ష‌న్ల‌ను వాట్స‌ప్ చూపిస్తుంది. ఆ ఫోటోకు ఎమోజీలు యాడ్ చేయ‌డం, స్టిక్క‌ర్స్‌, టెక్స్ట్ యాడ్ చేయ‌డం లాంటివి.. ఇలా ప‌లు ఎడిట్ ఆప్ష‌న్ల‌తో డ్రాయింగ్ టూల్స్ అనే ఆప్ష‌న్‌ను వాట్స‌ప్ తాజాగా తీసుకొచ్చింది. ఇప్ప‌టికే.. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజ‌ర్ల‌కు వాట్స‌ప్ ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ను తీసుకొచ్చింది కానీ.. అది కూడా బీటా వ‌ర్ష‌న్‌లోనే రిలీజ్ అయింది. దీంతో ఆ ఫీచ‌ర్స్ కూడా సెలెక్టెడ్ యూజూర్ల‌కు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:Edit photos on WhatsApp web from now on

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page