ఈతకు రాలేదు.. పొదుగు లేదు.. పితక్కుండానే పాలధార..

0 29

చిత్తూరు ముచ్చట్లు :

 

ఈతకు రాలేదు.. పొదుగులేదు.. అయినా పితక్కుండానే ఆవు నుంచి పాలధార వస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. వెంకటరమణారెడ్డికి చెందిన రెండున్నర సంవత్సరాల వయసున్న ఆవు పొదుగు నుంచి పాలు కారుతోంది. ఆదివారం సాయంత్రం ఒక పర్యాయం ఒకటిన్నర లీటరు పాలు ధారగా వచ్చింది. నాలుగు రోజులుగా రోజు మార్చి రోజు ఒకసారి పితికితే తరువాత దానంతట అదే పాలు కారుతోంది. హార్మోను సమస్యల కారణంగా పదివేల ఆవుల్లో ఒకదానికి ఇలా జరుగుతుందని, పది పర్యాయాల తరువాత పాలు కారడం ఆగిపోతుందని పశువైద్యాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Did not swim .. No udder .. Milky way without pitching ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page