ఉపాధి హామీ పథకం పనులపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

0 32

అమరావతి  ముచ్చట్లు:

ఉపాధి హామీ పథకం పనులపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అడిగిన సమాచారం ఇవ్వకపోవటంతో కేంద్ర ప్రభుత్వంపై కోర్టు సీరియస్‌ అయింది. కోర్టు ఆదేశించినా సమాచారం ఇవ్వకుండా పాక్షికంగా మెమో ఫైల్ చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఇప్పటివరకు అఫిడవిట్‌ దాఖలు చేయనందుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి ఆదేశించింది. ఈ దశలో కేంద్ర అడిషనల్‌ సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుంది.  2014 నుంచి నరేగా కింద జరిగిన పనులు, చెల్లింపుల వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అలా అఫిడవిట్‌ వేయకపోతే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కోర్టు ముందు హాజరుకావలసి ఉంటుందని హెచ్చరించింది. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీచేస్తామని కోర్టు హెచ్చరించింది. విచారణ ఆగస్ట్ 17కి కోర్టు వాయిదా వేసింది. ఈలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Another hearing in the AP High Court on the work of the Employment Guarantee Scheme

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page