ఓబీసి బిల్లుకు వైసీపీ మద్దతు

0 7

న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ.. లోక్‌సభ సభ్యులు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ ఈ ప్రెస్మీట్‌లో మాట్లాడుతూ.. ఓబీసీ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఏయే కులాలు వెనకబాటు తనంలో ఉన్నాయనే దానిపై.. రాష్ట్ర ప్రభుత్వాలకే సంపూర్ణ అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈ బిల్లు తీసుకునొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు, ఓబీసీలపై కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టారు.ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా ఓబీసీల రిజర్వేషన్ల అంశాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఓబీసీ బిల్లును సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు.ఇక, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్‌ నామమాత్రంగానే ఉందని మోపిదేవి విమర్శించారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ బీసీల అభివృద్ధి కోసం రూ. 30 వేల కోట్లు కేటాయిస్తే.. మరి 29 రాష్ట్రాలు ఉన్న కేంద్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లు మాత్రమే కేటాయించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ.. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం గుర్తించలేని ఓబీసీ కులాలు సుమారు 671 ఉన్నాయని, ఈ బిల్లు ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:YCP supports OBC bill

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page