కనక దుర్గను దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి

0 16

విజయవాడ  ముచ్చట్లు:
టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు  మేళతాళాలతో మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం  వేద పండితులు  వేద ఆశీర్వచనం చేసారు. ఆలయ ఈవో బ్రమరాంబ సుబ్బారెడ్డి దంపతులకు లడ్డూ ప్రసాదాన్ని అమ్మ వారి చిత్రపటాన్ని అందించారు.సుబ్బారెడ్డి మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించాను.  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు.  ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని జగన్ మోహన్ రెడ్డి పాలన లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో ప్రజలకు చేరాలని అమ్మవారిని వేడుకున్నాను. జలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నానని అన్నారు…

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:YV Subbareddy visitando Kanaka Durga

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page