కాంతారావుకు దారెటు…

0 15

ఖమ్మం  ముచ్చట్లు:

పినపాక నియోజవర్గం నుంచి రోజు రోజుకు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నాడా.. లేదా.? ఒకవేళ పట్టించుకుంటే ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతా రావు వెంట ఉన్న కార్యకర్తలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ నడుస్తున్నట్టు సమాచారం. రేగా వెంట ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూడటంలో ఆంతర్యమేంటని ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కార్యకర్తలందరూ సీతక్క వైపు నడిస్తే.. మరి రేగా పరిస్థితి ఏంటన్నదే ప్రజల్లో ఆసక్తికరంగా మారింది.గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కాంగ్రెస్ మళ్లీ పట్టు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో సీతక్క ప్రజల కోసం, ఆదివాసీ గిరిజన గ్రామాల వైపు, గుట్టల వైపు తిరుగుతూ ఆదివాసీ బిడ్డలను కాపాడుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీతక్క నియోజకవర్గంపై దృష్టి పెడితే రేగా ఇబ్బందులు తప్పవని ప్రజల్లో చర్చ నడుస్తోంది.అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా టీఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రజలకు అదిచేస్తా ఇది చేస్తా అని ఉట్టి మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారని కొందరు ప్రముఖులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలే బలంగా వినిపిస్తున్నాయి. ఇకపోతే నియోజకవర్గంలో భూ కబ్జాలు, ఇసుక మాఫియాలు, సెటిల్మెంట్ దందాలు ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం. ఈ దందాలకు ఎమ్మెల్యే రేగానే కారణమా.? లేక రేగా పేరు చెప్పుకొని కార్యకర్తలు చేస్తున్నారా.? అనే ఆరోపణలు ఉన్నాయి.నియోజకవర్గంలో కొంత మంది కార్యకర్తల వల్లే రేగాకు చెడ్డపేరు వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నో దందాలు చేస్తూ.. అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ప్రజల నుంచి ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి దందాలకు రేగా సపోర్ట్ చేస్తున్నాడా.. లేక ఖండిస్తున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఇవన్నీ చూడలేకనే ప్రజలు ములుగు ఎమ్మెల్యే సీతక్క వైపు చూస్తున్నారనే విషయం హార్ట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో కొంతమంది మేధావులు, పలువురు నాయకులు సీతక్కని కలిశారని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ సీతక్క పినపాక నియోజకవర్గంలో అడుగు పెడితే పరిస్థితులు ఎలా ఉండనున్నయో చూడాల్సిందే.ఇకపోతే ఎక్స్ ఎమ్మెల్యే పరిస్థితి అయోమయంలో పడిందని, ఎక్స్ ఎమ్మెల్యే ఊసే నియోజకవర్గంలో వినపడటంలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎక్స్ ఎమ్మెల్యే పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, తదితర కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారనే చర్చ ప్రారంభమైంది. ఏది ఏమైనప్పటికీ పినపాక నియోజకవర్గంలో సోషల్ మీడియా ద్వారా జై రేగా అని కొంతమంది.. జై సీతక్క అని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నట్టు సమాచారం. కాబట్టి రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Kantaravuku Daratu …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page