కారు దగ్దం….మృతదేహం లభ్యం

0 14

మెదక్ ముచ్చట్లు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్ పర్తి శివారులో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి హోండా సిటీ కారు ను  దగ్ధం చేశారు. కారు డిక్కీలో గుర్తుతెలియని శవం పూర్తిగా దగ్ధమై ఉండడంతో సంచలనంగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకున్న తూప్రాన్ సిఐ స్వామి గౌడ్ వెల్దుర్తి ఎస్సై మహేందర్ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇంజన్ పై ఉన్న నెంబర్ ఆధారంగా టీఎస్ 15ఈహెచ్ 4005 నెంబర్ గా గుర్తించారు. కారు యజమాని మెదక్ పట్టణానికి చెందిన ధర్మకర్ శ్రీనివాస్ పేరు పై రిజిస్ట్రేషన్ అయి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తూప్రాన్ డిఎస్పి కిరణ్ కుమార్ విచారణ చేస్తున్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Car burn… .Body available

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page