కోవిడ్ నియంత్రణకు మాస్క్, టీకానే రక్ష.

0 18

-సెట్నెల్ సీఈఓ పుల్లయ్య

నెల్లూరు     ముచ్చట్లు:

- Advertisement -

ఆర్టీసీ బస్టాండ్, మద్రాస్ బస్టాండ్, కూరగాయల మార్కెట్ వద్ద పీఎంపీ,ఏపీడబ్ల్యూజే, రూడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నో మాస్క్, నో సేల్, నో ఎంట్రీ, నో రైడ్ పై అవగాహన మరియు ర్యాలీ, మాస్కుల పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  సెట్నెల్ సిఈఓ పుల్లయ్య,  ఎన్జీవో నోడల్ అధికారి డా.మహిదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణలో భాగంగా సోమ,మంగళ,బుధవారాలలో నో మాస్క్,నో సేల్,నో ఎంట్రీ,నో రైడ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నందున ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించ్చాలని, భౌతిక దూరం పాటించాలని, సానిటైజ్ చేసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. పీఎంపీలు, రూడ్స్, ఏపీడబ్ల్యూజే సహకారంతో అవగాహన కల్పిస్తూ, మాస్కులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.ఏపీ న్యూ డబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఈ సందర్భంగా గా ఎ. జయప్రకాష్ మాట్లాడుతూ  ఆర్టీసీలో గాని,కూరగాయల మార్కెట్లో గాని చాలామంది మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వారివల్ల కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశములు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లిళ్లు, పండుగలు, ప్రయాణాలు ఇంకా కొద్దికాలం వాయిదా వేసుకుంటే మంచిదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు .ప్రభుత్వ వైద్యశాలలో, సచివాలయాలలో వ్యాక్సిన్ వేస్తున్నారని, గర్భిణీ స్త్రీలు, పాలుఇచ్చే తల్లులుతోపాటు, అర్హత గలిగిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో అడ్వకేట్  రమాదేవి, రూడ్స్ అధ్యక్షులు షేక్ రసూల్, పీఎంపీ అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, సభ్యులు శేషయ్య, ప్రసాద్, శ్రీనివాసులు, వీరయ్య, శంకర్ రావు, చంద్ర శేఖర్, రాజేష్, నారాయణ, సుబాన్, నశ్రీన్, సెట్నెల్ సిబ్బంది గాయజ్, రవిచంద్ర, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Mask for Kovid control, vaccine amulet.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page