క్రమం తప్పకుండా ఆరోగ్య పరిక్షలు చేసుకోవాలి…మేయర్ శిరీష

0 18

తిరుపతి ముచ్చట్లు:

 

ఇప్పుడున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరిక్షలు చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా అన్నారు.తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లలితా కళా ప్రాంగణంలో మంగళవారం డాక్టర్ మోహన్ డయబెటిక్ సెంటర్ వారిచే మునిసిపల్ సిబ్బందికి కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన అనంతరం మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ ప్రజలంతా ఓక క్రమ పద్దతి ప్రకారం పరిక్షలు చేసుకోవాలని,అందులో ముఖ్యంగ షూగర్ పరిక్షలు,కిడ్ని పరిక్షలు చేసుకోవాలని సూచించారు.షూగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేసుకోరాదని,క్రమం తప్పకుండా డాక్టర్లు సూచించిన మందులను వాడుతునే వుండాలని,నిర్లక్ష్యం చేస్తే కంటి సమస్యలు,కిడ్ని సమస్యలు,నరాల సమస్యలు వచ్చే ప్రమాదం వుందని తెలియజేసారు.ఇప్పటి జీవన పరిస్థుల్లో కొన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయని చెబుతూ ప్రజలంత ఒత్తడికి లోనుకాకుండా చూసుకోవాలని,సరైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార అలవాట్లను పాటించడం,ప్రతిరోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని మేయర్ డాక్టర్ శిరీషా తెలియజేసారు.మునిసిపల్ ఉధ్యోగస్తులతో బాటు మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, అదనపు కమిషనర్ హరితలు బీపి,షూగర్ టెస్టులను చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ మెడికల్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ,మేనేజర్ హాసిమ్,డాక్టర్ మోహన్ డయబెటిక్ సెంటర్ డాక్టర్ స్రవంతి,బ్రాంచ్ మేనేజర్ నరేంద్ర,వైసిపి నాయకులు జల్లి తులసీ యాదవ్,ఈతమాకుల సురేష్ యాదవ్,మాహేష్ యాదవ్,దూది శివలు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Have regular health check-ups … Mayor Sirisha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page